నాటు సారా వైపు పరిగెడుతున్న పేదవాడు ?? 

-

కేంద్ర ప్రభుత్వం కొత్త సడలింపు లతో దేశవ్యాప్తంగా మద్యం షాపులు ఓపెన్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందు నుండి మందు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. అధికారంలోకి రావటం రావటమే మద్యపానాన్ని పూర్తిగా ప్రభుత్వమే నడిపించే విధంగా సరికొత్త టెండర్ విధానాన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేయడం జరిగింది. అదే సమయంలో మందు షాపు లో ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తాగే సిట్టింగ్ లేకుండా చేసి ఉదయం 9 గంటలనుండి రాత్రి 7 గంటలవరకు మాత్రమే షాప్ లు ఓపెన్ అయ్యేలా వ్యవహరించడం జరిగింది.

చాలా వరకు రాష్ట్రంలో మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు వేయటం అప్పట్లో మనం చూశాం.  అయితే మధ్యలో కరోనా వైరస్ రావటంతో పూర్తిగా మద్యపాన దుకాణాలు మొత్తం బంద్ అయిపోయాయి. దీంతో ముందుగా మందు కొనుగోలు చేయడం కోసం ఉన్న అతి కొద్ది సమయం కూడా లేకుండా పోయింది. ఇటువంటి సమయంలో ఇటీవల కేంద్రం ఆరెంజ్, గ్రీన్ జోన్ లో మద్యం షాపులు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఏపీలో కూడా షాపులు ఓపెన్ అయ్యాయి.

 

కానీ మద్యం కొనడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దానికి కారణం చూస్తే 50 శాతం ధరలు మద్యం పై పెంచేసాడు. చాలా వరకు జగన్ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా గాని డబ్బులు లేక పోవడంతో పేదవాళ్లు నాటుసారా వైపు పరిగెడుతున్నారు. ప్రజల ప్రాణాలను మరియు కుటుంబాలను నిలబెట్టాలని జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల, ఇప్పుడు పేదవాడు నాటుసారా తాగడానికి తాపత్రయ పడుతూ తన ప్రాణానికి హాని తెచ్చుకుంటున్నాడు. జగన్ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా గాని మరోపక్క పేదవాడు మాత్రం మద్యపానాన్ని మానుకోలేక వేరే దారులు ఎదుర్కొంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version