దేశానికి ఆదాయం మొదలైందా ? కొంచెమైనా ?

-

కరోనా వైరస్ ని ఎదుర్కోవడం కోసం కేంద్ర ప్రభుత్వం భారత దేశంలో దాదాపు రెండు నెలలపాటు లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. మొదట మార్చి 22వ తారీఖున జనతా కర్ఫ్యూ అంటూ ప్రకటించి ఆ తరువాత 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. అప్పటికి కూడా దేశంలో కరోనా వైరస్ కంట్రోల్ కాకపోవడంతో మే 3 వరకు పొడిగించడం జరిగింది. అయినా కానీ ఉన్న కొద్దీ ఉధృతంగా పాజిటివ్ కేసులు బయటపడటంతో మే 17వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కానీ ఈ సారి మాత్రం గ్రామీణప్రాంతాల్లో పరిశ్రమలకు వ్యవసాయ పనులకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గ్రీన్ ఆరెంజ్ జోన్లలో వ్యాపార కార్యకలాపాలకు కూడా అనుమతి ఇవ్వటం జరిగింది. దీంతో ఎప్పటి నుండో దేశానికి ఆదాయం కోల్పోవటంతో ఈ నిర్ణయంతో మెల్ల మెల్లగా పూర్తిగా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. అదే సమయంలో గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో ఆదాయం బాగానే ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇదే సమయంలో పరిమిత సంఖ్యలో కూడా బస్సులు గ్రీన్ జోన్ లలో నడుపు కోవచ్చని అనుమతి ఇవ్వడంతో కొంతమేర రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరటనిచ్చే అంశంగా మారింది. మొత్తంమీద చూసుకుంటే మూడో దశ లాక్ డౌన్ సమయములో కేంద్రం ఇచ్చిన మినహాయింపులు నిర్ణయాలతో దేశవ్యాప్తంగా ఇన్కమ్ రాబడి మొదలైనట్లు ఆర్థిక నిపుణులు అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version