దారుణం : ఎస్వీబీసిలో పోర్న్ కలకలం !

-

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో పోర్న్ సైట్ లింక్ లు కలకలం రేపుతున్నాయి. వెంకటేశ్వర భక్తి ఛానల్ కి సంబంధించి శతమానంభవతి కార్యక్రమాన్ని గురించి ఒక భక్తుడు ఎస్విబిసికి మెయిల్ చేశాడు, అయితే తిరిగి భక్తుడికి ఎస్వీబీసీ నుంచి ఒక పోర్న్ సైట్ లింక్ తో మెయిల్ రిప్లై వచ్చింది. ఈ క్రమంలో ఈ విషయన్ని టీటీడీ చైర్మన్ అలాగే ఈవోకు సదరు భక్తుడు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి విజిలెన్స్ విభాగానికి సమాచారం అందించారు. ఈ క్రమంలో ఎస్విబిసి ఆఫీసులో టిటిడి విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఈడీపీ అధికారులు ఏక కాలంలో సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే ఎస్విబిసి ఆఫీసులో ఐదుగురు ఉద్యోగులు పోర్న్ సైట్లు చూస్తున్నారని గుర్తించింది సైబర్ క్రైం టీం. అలానే సదరు భక్తుడికి ఈ పోర్న్ సైట్ వీడియో లింక్ పంపిన ఉద్యోగిని కూడా గుర్తించారు. అంతేకాక విధులు నిర్వర్తించకుండా ఆఫీస్ సమయంలో ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది ఉద్యోగులను కూడా గుర్తించారు. దీంతో వీరందరి మీద చర్యలు తీసుకునేందుకు ఎస్విబిసి అధికారులు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version