కరోనా నేపథ్యంలో ప్రస్తుతం చాలా మంది తమ వస్తువులను శానిటైజ్ చేసుకునేందుకు అనేక రకాల యూవీ స్టెరిలైజర్లను వాడుతున్నారు. అందులో భాగంగానే పోర్ట్రోనిక్స్ కంపెనీ ఎప్పటికప్పుడు యూవీ స్టెరిలైజర్ డివైస్‌లను లాంచ్ చేస్తోంది. ఇక తాజాగా ప్యూరిఫై 102 పేరిట మరో కొత్త యూవీ స్టెరిలైజర్‌ను ఆ కంపెనీ విడుదల చేసింది. ఇందులో ఉండే అడ్వాన్స్‌డ్ యూవీ లైట్స్ మనం ఉపయోగించే ఫోన్లు, వాలెట్లు, కీస్, జ్యువెల్లరీ, టూత్ బ్రష్‌లు, గ్లాసెస్, మేకప్ టూల్స్ ను శానిటైజ్ చేస్తుంది.
ప్యూరిఫై 102 డివైస్ చాలా లైట్ వెయిట్‌ను కలిగి ఉంటుంది. దీన్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. ఇందులో 2 యూవీ ల్యాంప్స్‌ను ఏర్పాటు చేశారు. అవి రెండు వైపులా ఉంటాయి. దీంతో 360 డిగ్రీల కోణంలో ఉపరితలాలను శానిటైజ్ చేయవచ్చు. అలాగే రెండు రకాల మోడ్స్ ఇందులో ఉంటాయి. ఫాస్ట్ మోడత్‌తో 10 నిమిషాల్లోనే వస్తువులను శానిటైజ్ చేయవచ్చు. స్టెరిలైజేషన్ మోడ్‌తో 30 నిమిషాల్లో వస్తువులు అధిక శాతం వరకు శానిటైజ్ అవుతాయి.
ఇక ఈ స్టెరిలైజర్ పైభాగంలో 10 వాట్ల వైర్‌లెస్ చార్జర్‌ను అందిస్తున్నారు. అందువల్ల దాని సహాయంతో ఫోన్లను చార్జింగ్ చేసుకోవచ్చు. పోర్ట్రోనిక్స్ ప్యూరిఫై 102 డివైస్ ధర రూ.2499గా ఉంది. దీన్ని అమెజాన్‌తోపాటు పోర్ట్రోనిక్స్ ఆన్‌లైన్ స్టోర్‌లో, ఇతర అన్ని ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.