Post Office Rs. 299 Insurance Scheme: ప్రయోజనాలు బోలెడు..!!

-

పోస్టు ఆఫీస్‌లో ఎన్నో జీవిత బీమాలు ఉన్నాయి. చిన్నదో పెద్దదో ఏదో ఒక బీమా అయితే ఉండాలని అందరూ అనుకుంటున్నారు. బీమా అనేది ఒక నిత్యవసర సాధనంగా మారిపోయింది. ఇండియా పోస్ట్‌ అత్యంత చవకగా ఏడాదికి రూ.299, రూ.399కే ప్రమాద బీమా పాలసీలను ఆఫర్‌ చేస్తోంది.

ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంక్‌ వినియోగదారులు ఈ పాలసీలను ఉపయోగించుకోవచ్చు. 16-65 ఏళ్ల వయస్కులు అతి తక్కువ ప్రీమియం చెల్లించి ఈ పాలసీల ప్రయోజనాలను పొందొచ్చు. రూ.399తో రూ.10 లక్షల బీమాను అందిస్తున్నారు. ఇందులో ప్రమాదవశాత్తు మరణించడం, శాశ్వతంగా వైకల్యం, పర్మనెంట్‌ పార్షియల్‌ డిసెబిలిటీ, యాక్సిడెంటల్‌ డిస్‌మెంబర్‌మెంట్‌, పెరాలసిస్‌ వంటివి కవర్‌ అవుతాయి.

ప్రమాదం జరిగినప్పుడు వైద్య ఖర్చులకు ఐపీడీ కింద రూ.60,000, ఓపీడీ కింద రూ.30,000 పొందొచ్చు. ఒకవేళ ఆస్పత్రిలో ఉండాల్సి వస్తే రోజుకు రూ.1000 చొప్పున పది రోజులు ఇస్తారు. వీటికి తోడుగా ఎడ్యుకేషన్‌ బెనిఫిట్‌ ఉంటుంది. బీమా మొత్తంలో పది శాతం లేదా లక్ష రూపాయిలు ఈ రెండింట్లో ఏది తక్కువైతే దానిని ఇద్దరు పిల్లలకు ఇస్తారు. కుటుంబ ప్రయాణాలకు రూ.25,000, అంత్యక్రియల కోసం రూ.5000 ఇస్తారు.

ఇండియా పోస్టులో కనీస బీమా ప్లాన్‌ రూ.299కే అందుబాటులో ఉంది. రూ.399తో పోలిస్తే ఇందులో కొన్ని ప్రయోజనాలు తక్కువగానే ఉంటాయి. ప్రమాదవశాత్తు మరణించడం, శాశ్వత అంగవైకల్యం, ఏదో ఒక అవయవ వైకల్యం, యాక్సిడెంటల్‌ డిస్‌మెంబర్‌మెంట్‌, పెరాలసిస్‌ వంటివి కవర్‌ అవుతాయి. ఎడ్యుకేషన్, కుటుంబ ప్రయాణం, అంత్యక్రియలు, ఆసుపత్రిలో రోజువారీ ఖర్చులు ఇవ్వరు. ఐపీడీ కింద రూ.60వేలు, ఓపీడీ కింద రూ.30వేలు పొందొచ్చు.

పాలసీ పరిమితులు- ఈ బీమాతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆత్మహత్య, సైనిక సేవలు, సైనిక ఆపరేషన్లు, యుద్ధం, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, రోగాలు, ఎయిడ్స్‌, ప్రమాదకరమైన క్రీడల్లో ప్రమాదాలు జరిగితే బీమా కవర్‌ అవ్వదు.

మనకు ఏం అవుతుందిలే అనుకోవడం పొరపాటు..లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. బీమా ఉంటే వచ్చిన నష్టంలో కొంతలో కొంతైన తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version