పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. రూ.200 పొదుపు చేస్తే.. రూ.10 లక్షలు..!

-

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్: ఈరోజుల్లో చాలా మంది డబ్బులని ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇలా డబ్బులని స్కీముల్లో పెట్టడం వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. మీరు కూడా మంచిగా డబ్బులని పొదుపు చెయ్యాలని అనుకుంటున్నారా..? చాలా పోస్ట్ ఆఫీస్ అందించే స్కీముల గురించి చూడచ్చు. రిస్క్ లేకుండా రాబడి పొందాలని అనుకుంటే పలు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ లో డబ్బులని పెడితే చాలా లాభదాయకంగా ఉంటుంది. రిస్క్ లేకుండా ఆకర్షణీయ రాబడి ని పోస్టల్ స్కీమ్స్ తో పొందవచ్చు. స్కీమ్ ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా మారుతుంది.

స్కీమ్ ప్రకారం వడ్డీ రేటు కూడా ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ స్కీము లో పెట్టవచ్చు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ చాలా బెస్ట్ స్కీమ్. దీనిలో మీరు ప్రతి నెలా కొంత మొత్తం డిపాజిట్ చెయ్యవచ్చు. రూ. 100తో కూడా ఈ పథకంలో డబ్బులు పెట్టచ్చు. స్కీము మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ఇంకో ఐదేళ్ల వరకు మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు. కావాలంటే మరో ఐదేళ్ల వరకు మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు. 6.2 శాతం వరకు వడ్డీ రేటు వస్తోంది.

ఆర్‌డీ స్కీమ్‌లో చేరడం వల్ల ప్రతి మూడు నెలలకు ఒక సారి వడ్డీ ఖాతా లో పడుతుంది. మెచ్యూరిటీ సమయంలో డబ్బులని ఒకేసారి ఇస్తారు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. సింగిల్‌గా లేదంటే జాయింట్ అకౌంట్ లో చేరొచ్చు. మూడేళ్లు దాటిన తర్వాత ఉపసంహరించుకోవచ్చు. పిల్లల పేరుపై కూడా ఓపెన్ చెయ్యవచ్చు. లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు లోన్ రూపంలో పొందొచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ మారొచ్చు. లేకపోతే స్థిరంగా ఉండొచ్చు. త్రైమాసికం చొప్పున వడ్డీ రేటును సమీక్షిస్తూ వస్తుంది. నెలకు రూ. 6 వేలు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే పదేళ్ల మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 10 లక్షల దాకా వస్తుంది. వడ్డీ రేటు 6.2 శాతంగా తీసుకుంటే ఎక్కువ రాబడి లభిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version