ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నట్లే కనిపిస్తోంది. ఏ అంశంలో జగన్‌ని నెగిటివ్ చేయాలని తెగ ట్రై చేస్తుంది. ముందు నుచి అదే పనిలో ఉంటుంది. ఎక్కడా వదలకుండా చంద్రబాబుతో సహ మిగిలిన టిడిపి నేతలు డైలీ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. టిడిపికి నేతలు తోడు రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అదే పనిలో ఉంటున్నారు.
ఇటీవల ఏపీలో కరెంట్ సమస్యలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడుప్పుడే గ్రామాల్లో కరెంట్ కోతలు మొదలయ్యాయి….అలాగే నిదానంగా పట్టణాల్లో కూడా ఈ కరెంట్ కోతలు పెరిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అయితే దీనిపై జగన్ ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఎక్కువగా ఉందని, భవిష్యత్‌లో అధికారికంగా కోతలు కూడా విధించే అవకాశాలు ఉన్నాయని, రాత్రి 6-10 గంటల సమయంలో ప్రజలు కరెంట్ వాడకం కాస్త తగ్గించాలని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రిక్వెస్ట్ చేశారు.
దేశంలో బొగ్గు కొరత ఉందని, పైగా ధరలు పెరిగాయని, ఎంత డబ్బు వెచ్చించిన ఇది పరిష్కారం అయ్యేలా లేదని అన్నారు. అంటే ప్రజలు కరెంట్ కోతలకు సిద్ధమవ్వాలని సజ్జల చెప్పేశారు. ఇలా క్లారిటీగా సజ్జల కరెంట్ కోతలు ఉంటాయని చెప్పేశారు…కానీ దీనిపై టిడిపి, రఘురామ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతూ….ఇది జగన్ ప్రభుత్వ వైఫల్యం అని మాట్లాడుతున్నారు.
అసలు దేశంలోనే బొగ్గు కొరత ఉందిరా దేవుడా అంటే…అబ్బే ఇదంతా జగన్ తప్పే అంటారు టిడిపి వాళ్ళు. అంటే ఇంట్లో కరెంట్ పోతే…అది జగన్ తీసేశారని టిడిపి నేతలు చెప్పేలా ఉన్నారు. ఇక చిన్నపిల్లాడు అన్నం తినడం మానేసిన దానికి కారణం జగన్ అనేలా ఉన్నారు. అయినా ప్రతిపక్షాలు ఆడే ‘పవర్’ గేమ్‌ని ప్రజలు నమ్మడం లేదనే చెప్పొచ్చు.