ప్రభాకర్‌రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి…తాడిపత్రిలో తగ్గేదేలే!

-

మళ్ళీ తాడిపత్రి రాజకీయాలు హీటెక్కాయి…అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రచ్చ మొదలైంది..ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిగా తాడిపత్రిలో మరొక యుద్ధానికి తెరలేచింది. అసలు మొదట నుంచి తాడిపత్రిలో జేసీ, పెద్దారెడ్డి ఫ్యామిలీల మధ్య రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ రచ్చ మరింత ముదిరింది. వైసీపీ నుంచి పోటీ చేసి పెద్దారెడ్డి..జేసీ ప్రభాకర్ తనయుడు అస్మిత్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి పెద్దారెడ్డి తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు..జేసీ ఫ్యామిలీకి ఎక్కడకక్కడే చెక్ పెట్టే దిశగా ముందుకెళుతున్నారు. కానీ రాజకీయంగా బలంగా ఉన్న జేసీ ఫ్యామిలీ సైతం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పెద్దారెడ్డిని నిలువరించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రిలో పెద్దారెడ్డికి చెక్ పెడుతూ ప్రభాకర్..టీడీపీని గెలిపించుకున్నారు. అలాగే మున్సిపల్ ఛైర్మన్ కూడా అయ్యారు.

ఇక్కడ నుంచి వార్ మరింత పీక్స్‌కు వెళ్లింది..ఇక తాజాగా తాడిపత్రిలో మరో వార్‌కు తెరలేచింది. అధికార బలంతో ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా తాడిపత్రి మున్సిపాలిటీలో ఉన్న ప్రధాన రహదారి మధ్యలో ఉన్న డివైడర్ ప్రాంతంలో తన తండ్రి రామిరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. దీన్ని ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీలో బలం ఉండటంతో విగ్రహం ఏర్పాటు కాకుండా అధికారులకు ఫిర్యాదు చేశారు.

అధికారులు ఏమో అటు ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఆపాలో, లేక ప్రభాకర్ రెడ్డికి సర్దిచెప్పాలో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు. అయితే పెద్దారెడ్డి..తన తండ్రి రామిరెడ్డి విగ్రహం పెట్టకుండా అడ్డుకోవాలని ప్రభాకర్ రెడ్డి చూస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి అతీతుడా..? అని జేసీ ప్రభాకర్ ప్రశ్నిస్తున్నారు.  న్యాయస్థానాల ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందే అని అంటున్నారు. మరి చూడాలి ఈ విగ్రహం రచ్చ ఎంత వరకు వెళుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version