డైరక్టర్ ని ట్రోల్‌ చేస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్

-

అభిమానుల ఎదురుచూపులకి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ బార్డర్‌ దాటితే హంగామా మొదలవుతుంది. ప్రభాస్‌ ఫ్యాన్స్ కూడా ఇలాగే ఎదురుచూసి చూసి డైరెక్టర్‌ని ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. ఏకంగా డైరక్టర్ రాధా క్రిష్ణ పై కంప్లైంట్లు ఇస్తున్నారు.

‘రాధేశ్యామ్’ అప్‌డేట్‌ కోసం ప్రభాస్‌ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. టీజర్‌ ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు, రాధాక్రిష్ణ కుమార్ ఎప్పుడు అప్‌డేట్‌ ఇస్తాడు అని వెయిట్‌ చేస్తున్నారు. కానీ రాధాక్రిష్ణ కుమార్‌ మాత్రం ‘రాధేశ్యామ్’ అప్డేట్స్‌ని రివీల్‌ చెయ్యట్లేదు. దీంతో ప్రభాస్ అభిమానులు రాధాక్రిష్ణ కుమార్ మిస్సింగ్‌ అని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌కి ట్వీట్ చేశారు.

‘రంగ్‌ దే’ ప్రమోషన్స్‌లో భాగంగా కీర్తీ సురేశ్‌ కనబడట్లేదని ట్వీట్‌ చేశాడు నితిన్. కర్నూలులో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌కి డైరెక్టర్‌, హీరోయిన్‌ ఎవరూ అటెండ్‌ కాలేదని ఈ మిస్సింగ్‌ ట్వీట్ పెట్టాడు నితిన్. దీంతో ఈ ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ రాధాక్రిష్ణ కుమార్‌ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి సార్ అని సిటీపోలీస్‌ని ట్యాగ్‌ చేశాడు ఒక అభిమాని.

ప్రభాస్‌ చాలా కాలం తర్వాత నటిస్తోన్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ ‘రాధేశ్యామ్’. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ వింటేజ్ లవ్‌స్టోరీ జులై 30న రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పటికీ ఫస్ట్ గ్లింప్స్‌ తప్ప టీజర్‌ రిలీజ్‌ చెయ్యలేదని అభిమానులు కొంచెం డిసప్పాయింట్‌ అవుతున్నారు. మరి ఇప్పటికైనా రాధాక్రిష్ణ కుమార్ అభిమానుల కోసం త్వరగా టీజర్‌ రిలీజ్‌ చేస్తాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version