పూణెలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఆరంభంలో బాగానే ఆడింది. కానీ వికెట్లను క్రమంగా కోల్పోతూ వచ్చింది. దీంతో భారత్ మ్యాచ్‌లో సునాయాసంగా విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై భారత్ 66 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ చేయగా భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (98 పరుగులు), కేఎల్ రాహుల్ (62), కృణాల్ పాండ్యా (58), విరాట్ కోహ్లి (56)లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 3 వికెట్లు తీయగా, మార్క్ వుడ్ 2 వికెట్లు తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. జానీ బెయిర్‌స్టో (94), జేసన్ రాయ్ (46)లు రాణించారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 4 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ 3, భువనేశ్వర్ కుమార్ 2, కృణాల్ పాండ్యా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తో ఆధిక్యం సాధించింది.