Prabhas : అభిమానానికి డార్లింగ్ ఫిదా .. రిట‌న్ గిప్టుగా ఖరీదైన వాచ్

-

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు మ‌న యంగ్ రెబ‌ల్ స్టార్. తాజాగా ఓ అభిమాని బ‌హుబలి ప్రభాస్‌కి షాక్ ఇచ్చే ప‌ద్ద‌తిలో త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. అభిమాని త‌న తలపై ప్రభాస్ అని క‌నిపించేలా గుండు కొట్టించుకున్నాడు. అతని అభిమానాన్ని చూసి షాక్‌ అయిన ప్రభాస్‌ సరదాగా అతడితో కాసేపు ముచ్చ‌డించారు.

అనంతరం తన వీరాభిమానికి త‌న ఖరీధైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇది ఫాజిల్‌ కంపెనీకి చెందిన వాచ్‌ అని తెలుస్తుంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రభాస్ తన అభిమానులకు ఇలాంటి బహుమతులు ఇవ్వడం కొత్తేమి కాదు. గతంలో కూడా ప‌లు సంద‌ర్బాల్లో త‌న అభిమానులపై సర్ ప్రైజ్ గిప్టులు ఇచ్చారు ప్ర‌భాస్.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సంక్రాంతి బ‌రిలో రాధేశ్యాం మూవీతో పోటీలో నిలువ‌నున్నారు. పండుగ రోజున‌.. త‌న అభిమానుల‌కు పెద్ద స్క్రీన్‌పై క‌నిపించి ఎంట‌ర్ టైన్ చేయ‌నున్నారు. అలాగే.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్ సినిమా షూటింగ్ కంప్లీట్ పూర్తి చేశారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా ద‌ర్శ‌నమివ్వ‌నున్నాడు. దాదాపు రూ. 400 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్నా ఈ చిత్రంలో కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా కీలకపాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version