విష్ణు మూర్తి అవతారంలో ప్రభాస్?

-

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. దీపికా పదుకొణె హీరోయిన్​గా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కనున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతోంది.

ప్రాజెక్టు కె సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే దిశగా చిత్రబృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘project K’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాని నిర్మాత అశ్వినీదత్ చెప్పారు. ‘project K’ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఆధునిక విష్ణుమూర్తికి సంబంధించి ఉంటుందని చెప్పారు. సినిమాలో భారీగా గ్రాఫిక్స్, ఎమోషన్లు, సెంటిమెంట్ కూడా బలంగా ఉంటాయని ఆయన చెప్పుకోచ్చారు. దీంతో ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రభాస్, విష్ణు అవతారంలో కనిపిస్తాడేమో అని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version