రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్స్ ఇస్తూ ఫుల్ ఖుషీ చేస్తున్నారు ప్రభాస్ నిర్మాతలు. ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి సలార్. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి వర్కింగ్ స్టిల్స్ విడుదల చేయగా..నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కంటెయినర్‌పై మాస్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ.. ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు.
ప్రభాస్ మాసీ లుక్ సలార్ సినిమాపై క్యూరియాసిటీ, అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ప్రభాస్ మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ కే లుక్ ఒకటి కూడా విడుదల చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ మరోవైపు తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో మైథాలాజికల్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ కూడా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.
Team #Salaar, Wishing #Prabhas a very Happy Birthday. #HappyBirthdayPrabhas @prashanth_neel @VKiragandur @hombalefilms@PrithviOfficial @shrutihaasan @IamJagguBhai@bhuvangowda84 @RaviBasrur @anbariv@shivakumarart @SalaarTheSaga pic.twitter.com/BKFc3sp6RO
— BA Raju's Team (@baraju_SuperHit) October 23, 2022