అతడిని ఉతికితే పాక్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని నాకు తెలుసు : కోహ్లీ

-

మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 160 పరుగుల టార్గెట్ ను 20 ఓవర్లలో అందుకుంది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై విశ్వరూపం ప్రదర్శించి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించిన మాజీ సారథి విరాట్ కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. ఈ సందర్భంగా కోహ్లీ స్పందిస్తూ, ఏం మాడ్లాడాలో తెలియడంలేదని, మ్యాచ్ ను ఎలా గెలిచామో ఇప్పటికీ నమ్మశక్యం కావడంలేదని పేర్కొన్నాడు.

చివరివరకు క్రీజులో ఉంటే ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలుస్తామని హార్దిక్ పాండ్యా గట్టిగా నమ్మాడని కోహ్లీ వెల్లడించాడు. “పెవిలియన్ ఎండ్ నుంచి షహీన్ అఫ్రిది బౌలింగ్ చేస్తే అతడిని బాదాలని నిర్ణయించుకున్నాం. హరీస్ రవూఫ్ వాళ్ల ముఖ్యమైన బౌలర్. అతడిని ఉతికితే పాక్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని నాకు తెలుసు. అందుకే అతడి బౌలింగ్ లో రెండు సిక్సులు కొట్టాను. ఇక ఇవాళ్టివరకు నేను ఆడిన ఇన్నింగ్స్ లలో మొహాలీలో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పేవాడ్ని. కానీ ఇవాళ్టి నుంచి పాకిస్థాన్ తో మ్యాచే నా బెస్ట్ ఇన్నింగ్స్ అంటాను. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా సహకారం మరువలేను. ముఖ్యంగా ప్రేక్షకుల మద్దతు అమోఘం. వారికి ఎల్లప్పుడు రుణపడి ఉంటాను” అంటూ కోహ్లీ వివరించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version