సాహోతో సైరాకు ఇబ్బందులు తప్పవా…!

-

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బాలీవుడ్ స్టాయిలో తెర‌కెక్క‌బోయే చిత్రాలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో` ఒక‌టైతే.. మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` మ‌రొక‌టి. భారీ బ‌డ్జెట్ల‌తో తెర‌కెక్క‌బోయే ఈ రెండు సినిమాల‌పై అంచ‌నాలు భారీ స్థాయిలో నెల‌కొన్నాయి. బాలీవుడ్ ప్రియుల‌ను కూడా ఈ చిత్రాలు ఆక‌ర్షిస్తున్నాయి. వాస్త‌వానికి `సైరా` క‌న్నా ఆగ‌ష్టు 30న రిలీజ్ కాబోయే `సాహో` చిత్రంపై కాస్త క్రేజ్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

Prabhas Saaho Effect On Chiranjeevi Sye Raa Narasimha Reddy

సాహోకు బాహుబ‌లి ఎఫెక్ట్‌తో పాటు హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కించ‌డంతో లెక్క‌కు మిక్కిలిగా క్రేజ్ ఏర్ప‌డింది. ఇక ఈ చిత్రం తొలి రోజే వంద‌ కోట్లు రాబ‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది. సాహో రిలీజ్ అయిన రెండు వారాల‌కు నాని గ్యాంగ్ లీడర్ ఆ త‌ర్వాత వారం వరుణ్ వాల్మీకి చిత్రాలు విడుద‌ల అవుతున్నాయి. అయితే సాహో హిట్ అయినా ఫ‌ట్ అయినా సైరాకు మాత్రం ఇబ్బందులు త‌ప్ప‌వంటున్నారు. ఎందుకుంటే సాహో ఒక వేళ‌ హిట్ అయితే క‌నీసం నాలుగు వారాలు థియేటర్లలో ఉండే అవ‌కాశం ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే ఆ త‌ర్వాత విడుద‌ల అయ్యే గ్యాంగ్ లీడర్, వాల్మీకితో పాటు సైరాపైన కూడా ఎఫెక్ట్ ప‌డుతుంది. జోనర్ వేర‌యిన‌ప్ప‌ట‌కీ.. సైరా ఏ మాత్రం తేడా కొట్టిన న‌ష్టం భారీగా ఉంటుంది. అదే విధంగా సాహో ఒక‌వేళ‌ ఆశించిన మేర విజయవంతం కాకపోయినా సైరాకు తిప్ప‌లు త‌ప్ప‌వు. రెండు తెలుగా రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు దాదాపు రూ. 100 కోట్ల మేరకు అడ్వాన్స్ లు, అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు.

మ‌రి సాహో అనుకున్న రేంజ్‌లో ఫ‌లితం ఇవ్వ‌క‌పోతే కలెక్షన్లు రాబట్టం కష్టం అవుతుంది. ఈ క్ర‌మంలోనే త‌ర్వాత రాబోయే సైరా సినిమాను కొన‌డానికి బయ్యర్లు, ఎగ్జిబిటర్ల‌కు ఏ మాత్రం సులువుకాని ప‌రిస్థితి. దీంతో సాహో హిట్ అయినా ఫ‌ట్ అయినా సైరాకు మాత్రం టెన్ష‌న్ త‌ప్పేలా లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version