టీవీల్లోకి వచ్చేస్తోన్న ప్రభాస్ ‘సలార్’ మూవీ.. ఎక్కడ అంటే ?

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీవసులను నమోోదు చేసింది. ఈ చిత్రం దాదాపు 700 కోట్లకు పైగా వసూళ్లను వసూలు చేసింది.ఇదిలా ఉంటే… ఈ మూవీ TVల్లోకి వచ్చేస్తోంది. ఈ నెల 21న సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది.

ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటించింది. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరి కుమారి , శ్రీయ రెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు.హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు.రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు.‘సలార్’కు సీక్వల్గా రాబోతున్న ‘సలార్-2’ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version