క్రికెట్‌కు భారతదేశంలో ఫుల్ క్రేజ్ ఉంది. సెలబ్రిటీల నుంచి మొదలుకుని సామాన్యుల వరకు అందరూ క్రికెట్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. క్రికెట్ మ్యాచ్ నడుస్తుందంటే చాలు..రెప్ప వాల్చకుండా చూసేవారున్నారు. ఇక క్రికెట్ ఆడేవాళ్లు అయితే సువిశాల భారతదేశంలోని ప్రతీ గల్లీలో ఉంటారు. ప్రతీ ఒక్కరు సచిన్ టెండుల్కర్ లానే ఫీలవుతుంటారు. అయితే, కలలు కనడంలో తప్పు లేదు. కానీ, అందుకు తగ్గట్లు ఆచరణ ఉండటం ముఖ్యం. ప్రొఫెషనల్‌గా రాణించాలనుకునే వారు అయితే శ్రద్ధ వహించి క్రికెట్ ఆడాల్సిన అవసరముంటుంది. అవకాశం లభిస్తే చాలు.. ప్రూవ్ చేసుకోవాలి. కాగా, అలానే ప్రూవ్ చేసుకున్నాడు అసోంకు చెందిన ప్రకాష్ భగత్ అనే ఆల్ రౌండర్. 2003లో గంగూలీతో కలిసి నేషనల్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ ఆడాడు ప్రకాష్. అప్పట్లో ప్రకాష్ భగత్ బౌలింగ్ స్టైల్‌ను చూసి గంగూలీ తెగ మెచ్చుకున్నాడు.
గంగూలీతో కలిసి ఆడిన క్రికెటర్.. ప్రస్తుతం పానీపూరి వ్యాపారంలో..
-