రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రజాప్రతినిధుల ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాని నిందితుడైన ఎస్ఐబి మాజీ డిఎస్పి ప్రణీత్ రావు తెలంగాణ హైకోర్టు ఆశ్రయించాడు నాంపల్లి కోర్టు విధించిన వారం రోజుల పోలీస్ కస్టడీని సవాల్ చేసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విని తీర్పు చేసినట్లు ప్రకటించింది విచారణ సందర్భంగా ప్రణీత తరపు న్యాయవాది గండ్ర మోహన్ వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కింద కోర్టు పోలీసు కస్టడీ ఇచ్చిందని వాదించారు.
సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదని కోర్టు కి చెప్పారు దర్యాప్తు తర్వాత పోలీస్ స్టేషన్ లో పడుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్ లో కాకుండా జైలుకి తరలించేలా కోరారు పోలీసులు దర్యాప్తు అంశాలని మీడియాకి లీక్ చేస్తున్నారని వాదించారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పుని రిజర్వులో పెట్టింది.