Pranita: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం.. శాండిల్ వుడ్ లోనే కాదు.. యావత్తు సినీ అభిమానులను ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఆయన అభిమానులు శోకసంద్రంలో ముంచేసింది. పునీత్ కేవలం సినిమాలతోనే కాదు.. పలు సేవా కార్యక్రమాలు చేస్తూ.. సమాజానికి దగ్గరయ్యారు. రియల్ హీరోగా సామాన్యుల మదిలో దైవమై.. నిలిచారు. ఇలా పునీత్ ఆదర్శంగా తీసుకుని.. కొందరు నటీనటులు ఆయన అడుగు జాడల్లో నడిచేందుకు సిద్దం అయ్యారు.
ఇప్పటికే తమిళ సార్ట హీరో విశాల్.. పునీత్ కు చాలా సన్నిహితుడు. పునీత్ ఆశయాలను తాను ముందుకు తీసుకెళ్లానని ప్రకటించారు. పునీత్ చదివించే 1800 పిల్లల బాధ్యత తీసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. విశాల్ నిర్ణయంపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.
కాగా.. ఇప్పుడు పునీత్ బాటలో నడవడానికి హీరోయిన్ ప్రణీత్ సుభాష్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ‘ప్రణీత ఫౌండేషన్’ ద్వారా కరోనా కష్ట కాలంలో ఎన్నో విధాలుగా సాయం చేసిన ప్రణీత.. ఇప్పుడు మరోసారి తన ఉదారతను చాటుకుంది. పునీత్ రాజ్‌కుమార్ గుర్తుగా బెంగళూరులో ఫ్రీ మెడికల్ క్యాంపు ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రణీత ప్రకటించింది.
పునీత్ గారు.. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. పలువురికి విద్య, వైద్య ఖర్చులను భరించారు. అలాంటి గొప్ప మనిషి అడుగుజాడల్లో నడవటమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి’ అని ప్రణీత తెలిపింది. నవంబర్ 3న బెంగుళూర్ లోని అంబేడ్కర్ భవన్లో వన్ డే మెడికల్ క్యాంపు ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఎవరైనా ఉచితంగా వైద్య పరీక్షలు చేసుకోవచ్చాని తెలిపారు ప్రణీత.