బ‌ద్వేల్‌ లో ఫ్యాన్ గాలి.. మూడో రౌండ్ లో 23,700 ఓట్ల ఆధిక్యం

-

బద్వేల్‌ నియోజక వర్గం లో వైసీపీ పార్టీ ఫ్యాన్‌ గాలి వీస్తోంది. ఈ ఉప పోరులో లక్ష మెజారిటీ దిశ గా వైసీపీ పార్టీ ముందుకు సాగుతోంది. బద్వేల్  మొదటి రౌండ్ లో 27 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు జరుగగా… వైసీపీ అభ్యర్థి సుధ 10478 ఓట్లు పోల్‌ కాగా… బీజేపీ పార్టీ అభ్యర్థి సురేష్ కు 1688 ఓట్లు వచ్చాయి. అటు కాంగ్రెస్ పార్టీ కమలమ్మ కు కేవలం 580 పడ్డాయి. ఇక నోటా కు ఏకంగా… 342 వచ్చాయి.

దీంతో మొద టి రౌండ్‌ లో వైసీపీ అభ్యర్థి సుధ 8790 ముందంజలో వచ్చి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇక కాసేటి క్రితమే… బద్వేల్‌ మూడో రౌండ్‌ ఫలితాలు కూడా వెలువడ్డాయి. రెండో రౌండ్‌ ప్రకటించక ముందే… మూడో రౌండ్‌ ప్రకించారు ఎన్నికల అధికారులు. అయితే… ఈ మూడో రౌండ్‌ ఫలితాల్లోనూ… వైసీపీ దూసుకువెళుతోంది. మూడో రౌండ్ కౌంటింగ్‌ అయ్యే సరికి…. 23,700 ఓట్ల ఆధిక్యంలోకి వైసీపీ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version