బాల్కొండలో మంత్రి హవా..చెక్ పెట్టేదెవరు?

-

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం..ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట…ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ పార్టీ కంచుకోట అని చెప్పవచ్చు. నియోజకవర్గం ఏర్పడిన మొదట నుంచి బాల్కొండలో కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంది. మొత్తం 10 సార్లు కాంగ్రెస్ గెలిచిదంటే బాల్కొండపై ఎంత పట్టు ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక మధ్యలో రెండుసార్లు టి‌డి‌పి గెలిచింది. 1983, 1985 ఎన్నికల్లోనే టి‌డి‌పి అక్కడ గెలిచింది. ఆ తర్వాత 1989 కే‌ఆర్ సురేశ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు.

ఇక టి‌డి‌పి హవా ఉన్న 1994, 1999 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ నుంచి సురేశ్ రెడ్డి గెలిచారు. 2004 ఎన్నికల్లో సురేశ్ హవా కొనసాగింది. ఆయన ఉమ్మడి స్పీకర్ గా కూడా పనిచేశారు. కానీ 2009 ఎన్నికల్లో ఊహించని ఫలితం వచ్చింది. అప్పుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం నుంచి అనిల్ కుమార్ బాల్కొండలో గెలిచారు. అయితే తెలంగాణ వచ్చాక సీన్ మారింది..అక్కడ బి‌ఆర్‌ఎస్ హవా నడవటం మొదలైంది.

2014 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి ప్రశాంత్ రెడ్డి 36 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018 ఎన్నికల్లో సైతం 32 వేల మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి విజయం సాధించారు. అయితే బి‌ఎస్‌పి అభ్యర్ధి పైన ప్రశాంత్ గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి అనిల్ పోటీ చేసి 30 వేల ఓట్లు తెచ్చుకుని మూడోస్థానానికి పరిమితమయ్యారు. మళ్ళీ బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి రావడం..ఇటు ప్రశాంత్ రెడ్డి మంత్రి కావడంతో బాల్కొండలో బి‌ఆర్‌ఎస్ హవా నడుస్తోంది. ఇక్కడ మంత్రికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ కష్టపడుతుంది. బి‌జే‌పి కూడా ఇక్కడ బలపడుతుంది.

అయితే ఇక్కడ ప్రధాన పోరు బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉండేలా ఉంది. కానీ ప్రశాంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నట్లే కనిపిస్తున్నారు. మళ్ళీ ఆయనకు చెక్ పెట్టడం కష్టమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version