ఫ్యాక్ట్ చెక్: ఇన్కమ్ ట్యాక్స్ నుండి మీకు మెయిల్ వచ్చిందా..? నిజం ఏమిటి..?

-

ఈ మధ్య కాలం లో నకిలీ వార్తలు విపరీతంగా వినపడుతున్నాయి. చాలా మంది నకిలీ వార్తలని చూసి మోసపోతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే అన్ని వార్తలు కూడా నిజం కాదు. ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాలు దాకా చాలా రకాల నకిలీ వార్తలు వస్తున్నాయి.

అలానే మన ఫోన్ లకి బ్యాంకుల నుండి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మెసేజ్లు మెయిల్స్ కూడా ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. ఇక సోషల్ మీడియా లో తాజాగా వచ్చిన వార్తను చూస్తే… ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అంటూ అందరికీ మెయిల్ వస్తోంది. 41 వేల ని మీ అకౌంట్లో వేస్తామంటూ వార్తలు వస్తున్నాయి. అలానే పర్సనల్ డీటెయిల్స్ ని అడుగుతున్నారు ఇది నిజమా కాదా అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది.

ఇందులో ఏమాత్రం నిజం లేదు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఇలాంటి మెయిల్స్ ని ఎవరికీ పంపలేదు ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త కాబట్టి అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తల్ని నమ్మి మోసపోవద్దు. ఫేక్ వార్తలే ఇలాంటి నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండకపోతే మీరే మోసపోవాల్సి వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి. నకిలీ వార్తలు నమ్మకండి. ఇతరులకి షేర్ చేయొద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version