ఆ బాలీవుడ్ హీరోతో ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ.. పెద్ద స్కెచ్ ఏ..!

-

ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో సెన్సేషన్ ని క్రియేట్ చేశారు. హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ సినీ ఇండస్ట్రీలో హనుమాన్ సినిమా తర్వాత విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు. ఎక్కడ చూసినా ఆయన పేరు ఇప్పుడు మారుమ్రోగి పోతోంది. ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సంపాదించుకున్నారు ప్రశాంత్ వర్మ ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ బాలీవుడ్ లో కూడా తన ప్రతాపాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ టీం వర్గాల నుండి అందుకున్న సమాచారం మేరకు దాదాపు వీళ్ళ కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావాలి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది ఇందుకోసం ప్రశాంత్ వర్మ పెద్ద ప్లాన్ వేసినట్లు అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version