కాంగ్రెస్ పార్టీకి నా అవసరం లేదు…. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు

-

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్ చిన్నపాటి కలకలాన్ని రేపింది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ… చాలా వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ సీనియర్లతో పాటు అధినేత్రి సోనియా గాంధీతో పలు మార్లు పీకే సమావేశం అయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరడమే తరువాయి అని అంతా అనుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు పీకే కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంతా అనుకున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం తమ పార్టీలో పనిచేయాలంటే ఇతర పార్టీలతో ఒప్పందాలను తెగదెంచుకోవాలని కాంగ్రెస్ షరతు పెట్టడంతో ప్రశాంత్ హ్యాండ్ కే హ్యాండ్ ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో చేరనని చెప్పేశారు. 

ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ గురించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేదని.. పార్టీని సొంతంగా పునరుద్ధరించుకునే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీ ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆ పార్టీలో పెద్దపెద్ద నేతలు ఉన్నారని ఆయన అన్నారు. 2024లో కాంగ్రెస్  గెలిచే ఛాన్స్ లేదని చెప్పడం తప్పని.. గెలవాలంటే వాళ్లు కొన్ని మార్పులు చేయాలన్నారు. కాంగ్రెస్ సమర్థవంతమైన నేతలున్నారని ప్రణాళికలను వారే స్వయంగా తయారు చేసుకోగలరని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు ఎలాంటి పీకేలు అవసరం లేదని సొంతంగానే తిరిగి నిలబడుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version