బ్రేకింగ్ : సొంత పార్టీ ప్రకటించనున్న ప్రశాంత్ కిషోర్..?

-

పొలిటికల్ అనాల్సిస్ట్ ప్రశాంత్ కిషోర్ (పీకే) చుట్టే జాతీయ రాజకీయాలు తిరుగుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో వరుస చర్చలు జరిపిన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. పీకే కాంగ్రెస్ లో చేరడం లేదని ఆయనే క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు పీకే సొంత పార్టీ పెట్టె దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.. అంతేకాదు, నేడు ఆయన పార్టీని ప్రకటించనున్నట్టు కూడా ఉత్తరాది రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ట్విట్టర్‌లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నట్టు, ఇందులో భాగంగా బీహార్‌లో నిన్న భావసారూప్య పార్టీలతో పీకే చర్చలు జరిపినట్టు కూడా సమాచారం.

కాగా, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పీకే ఇటీవల తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీని ప్రక్షాళన చేసి జవసత్వాలు నింపేందుకు కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే, పార్టీలోకి ఆయన రాకను కాంగ్రెస్‌ సీనియర్ నేతలు కొందరు వ్యతిరేకించగా.. ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ దేశంలోని వివిధ పార్టీలకు పనిచేస్తుండడం, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పీకే చర్చలు జరపడంతో ఆయన తీరుపై కాంగ్రెస్ నేతలు సందేహాలు వ్యక్తం చేయడంతో కాంగ్రెస్‌లో పీకే ఎంట్రీకి ఫుల్‌స్టాప్ పడింది. కాంగ్రెస్‌లో కీలక స్థానాన్ని ఆశించిన పీకేకు.. ఎన్నికల వ్యూహరచన కమిటీలో సభ్యుడిగా స్థానం కల్పిస్తామని సోనియా గాంధీ చెప్పడంతో మనసు మార్చుకున్న పీకే కాంగ్రెస్‌లో చేరబోవడం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సొంత పార్టీ ప్రకటించబోతున్నారంటూ వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version