హైకోర్టు నిర్ణయం బాధాకరం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

-

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ , గత నెల ఏప్రిల్ 28న హైకోర్టులో సమత రేప్ అండ్ మర్డర్ కేసులో హైకోర్టు నిందితుల ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చడం బాధాకరమని పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిర్భయ కేసులో ఎనిమిది సంవత్సరాల తర్వాత ఉరిశిక్ష పడిందని గుర్తు చేశారు ఆయన. దిశ కేసులో కూడా నిందితులు ఎన్ కౌంటర్ కు గురై చనిపోయారని, కానీ సమత కేసులో మాత్రం దారుణంగా అత్యాచారం హత్య చేసిన ఘటనలో లింగాపూర్,ఆసిఫాబాద్ పోలీసులు నిందితులను దొరకబట్టి లోయర్ కోర్టు ఉరి శిక్ష వేసిందని తెలిపారు ప్రేవీన్ కుమార్. కానీ ఆరు సంవత్సరాల తర్వాత ఈ కేసు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కాదని హైకోర్టు పేర్కొనడం అన్యాయం అని తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు నటిస్తోందని, కానీ సీఎం సొంత నియోజకవర్గంలోని వర్గల్ మండలంలో గుజరాత్ కు చెందిన అమూల్ ఫ్యాక్టరీని 500 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. ఒకపక్క 1500 మంది ఉద్యోగులతో 700 కోట్ల టర్నోవర్ తో పాడిరైతులను రక్షిస్తుంటే విజయ డెయిరీ ని నాశనం చేస్తుంది అని, మోడీ బీఎస్ఎన్ఎల్ ను నాశనం చేసి, జియో,ఎయిర్ టెల్ ను తీసుకొచ్చినట్లు, కేసీఆర్ విజయ, మదర్ డెయిరీలను నాశనం చేసేందుకు అమూల్ కంపెనీని తీసుకొచ్చారని మండిపడ్డారు ప్రవీణ్ కుమార్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version