ఆంధ్ర ప్రదేశ్ లో పీఆర్సీ రగడ కొనసాగూతూనే ఉంది. నేడు మళ్లీ ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. పీఆర్సీ సమస్యలపై ఉద్యోగులను బుజ్జగించేందుకు ప్రభుత్వం మంత్రులు, సీఎస్ 5 మందితో కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే నిన్న సమావేశంలో పాల్గొనేందుకు ఉద్యోగులను ప్రభుత్వం ఆహ్వానించిన ఉద్యోగులు రాలేదు. దీంతో నేడు మళ్లీ ఆహ్వానం పంపారు జీఏడీ కార్యదర్శ శశిభూషన్. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాల్సిందిగా కోరింది. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చని.. ప్రభుత్వం చెబుతోంది. మరో వైపు ఉద్యోగులు పీఆర్సీ జీవో రద్దు అనంతరమే చర్చలు అంటూ మెలిక పెడుతోంది.
ఇదిలా ఉంటే నిన్న ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ఏపీ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల జీతాలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య ఈరోజు సమావేశానికి ఉద్యోగులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఉద్యోగులు నోటీసులు ఇచ్చారు. కార్యాచరణ ప్రకారం మంగళవారం అన్ని జిల్లాల్లో ర్యాలీలతో నిరసన తెలుపనున్నారు ఉద్యోగులు.