ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్… పీఆర్సీ బిల్లులు ప్రాసెస్ చేయని అధికారులకు మెమోలు

-

సమ్మెలో ఉన్న ఉద్యోగులకు సర్కార్ షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. పీఆర్సీ బిల్లును ప్రాసెస్ చేయని అధికారులపై చర్యలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే పలుసార్లు ట్రెజరీ అధికారులకు ప్రభుత్వం చెప్పినా… వినకపోవడంతో వారందరికి ఛార్జ్ మెమోలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం వీరందరిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. 27 మంది డీడీలు, ఎస్టీవోలకు, ఏటీఓలకు ఛార్జ్ మెమోలు జారీ చేసింది. కొత్త పీఆర్సీకి సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినా.. తీరు మారకపోవడంతో మెమోలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల బిల్లులను ప్రాసెస్ చేసినప్పటికీ.. కొన్ని చోట్ల ఈ ప్రక్రియ స్లోగా సాగుతోంది. అలక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు ఏవిధంగా రియాక్ట్ అవుతాయో చూడాల్సి ఉంది. మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ.. కేబినెట్ నిర్ణయం తీసుకోగా…దాన్ని గవర్నర్ ఆమోదించారు. తాజాగా ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version