తెలంగాణ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీపై ఉత్త‌ర్వులు జారీ

-

తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ అమలు ఉత్తర్వులను విడుదల చేసింది సర్కార్. ఈ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 9,21,037 ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు మరియు పొరుగు సేవల ఉద్యోగులం దరికీ 30 శాతం అమలు కానుంది. అలాగే పెన్షనర్ల మెడికల్ అలవెన్సు రూ. 350 నుంచి రూ. 600కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు .. రిటైర్మెంట్ గ్రాట్యుటీ రూ. 12 లక్షల నుండి రూ. 16 లక్షలకు పెంపు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్.

15 శాతం పెన్షన్ పెంపు 75 సంవత్సరాల నుండి 70 ఏళ్లకు తగ్గింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. ఈ ఉత్తర్వులతో ఉద్యోగుల కు కనీస వేతనం రూ. 19 వేల కు పెరగనుంది. జూన్ నెల నుంచి ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందనున్నాయి. తెలంగాణ సర్కార్ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల తో ఉద్యోగుల్లో సంబరాలు మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version