ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం ముగిసింది. రెండు మూడు రోజుల్లోగా పీఆర్‌సీ పై ప్రకటన చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. కాగ ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ లోని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో గల 13 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగింది. పీఆర్‌సీ ప్రకటన చర్చించారు. సీఎం జగన్ తో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గతంలో కంటే మెరుగైన ఫిట్ మెంట్ ప్రకటించాలని కోరామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో అందరూ ఉద్యోగులకు ఒకే రకమైన ఫిట్ మెంట్ ప్రకటించాలని విజ్ఞాప్తి చేశామని తెలిపారు. 2010 లోనే 39 శాతం పెంచడం ఉత్తమం అని అన్నారు. అయితే 2020 లో ఎంత పెంచాలో ప్రభుత్వమే ఆలోచించాలని కోరామని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం 43 శాతం ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో 30 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిందని సీఎం జగన్ కు గుర్తు చేశామని తెలిపారు. అయితే పీఆర్ఎసీ పై స్పష్టమైన ప్రకటన రెండు మూడు రోజుల్లో వస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలిపారు.