చలికాలంలో చుండ్రుని నివారించే సింపుల్ టిప్స్..వీటితో సమస్య స్టాప్..!

-

ఈ సీజన్ లో చాలామందికి చర్మసమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఈ సీజన్ లో ఎక్కువైపోతాయి. సరే సీజన్ అయిపోయకా స్కిన్ మెల్లగా లైన్ లో పడుతుందిలే అనుకోవచ్చు. కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ అలాకాదే..ఊడిందంటే మళ్లీ రావటం..అంత హెల్తీగా అవటం చాలా కష్టం. శీతాకాలంలో చుండ్రు ఎక్కువగా ఇబ్బందిపెడుతుంది. దీనివల్ల హెయిర్ లాస్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు..దురద..బయటకు వెళ్లినప్పుడు ఈ దురద, ఆ చండ్రుతో ఎంత ఇబ్బందిగా ఉంటుందో కదా..శరీరంపై పడి..భుజాలమీద, మెడభాగంలో, ఫోర్ హెడ్ మీద మొటిలు కూడా బోనస్ గా వస్తాయి. ఒక్క చుండ్రువల్ల ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని వదిలించుకోవడానికి మార్కెట్ లో దొరికే షాంపులు అన్నీ ట్రై చేసినా ఆశించినంత ఫలితంరాకపోగా..ఉన్నది కూడా ఊడటం మొదలెడుతుంది. అయితి అందిరిలో ఇలానే ఉంటుంది అని చెప్పలేం..కొందిరకి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఈరోజు మనం ఇంటి చిట్కాలతో ఈ చుండ్రుసమస్యకు ఎలా ఫులుస్టాప్ పెట్టాలో చూద్దాం.

నూనెలతో మర్దన..

కొబ్బరి, బాదం, ఆలివ్, జొజోబా.. వంటి నూనెల్లో ఏదో ఒకదానితో లేదా వాటి మిశ్రమాన్ని తీసుకొని గోరువెచ్చగా వేడిచేయాలి. దాంతో మాడును బాగా మర్దన చేయండి..ఆ తర్వాత ఒక గంట సేపు అలా వదిలేయాలి. దీనివల్ల కుదుళ్లు నూనెను పీల్చుకొంటాయి. ఆ తర్వాత షాంపూతో తల స్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను వారానికి రెండు నుంచి మూడుసార్లు పాటించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అయితే శీతాకాలంలో మనం ఉపయోగించే కొన్ని షాంపూలు కూడా చుండ్రు రావడానికి కారణమవుతుంటాయి. కాబట్టి చుండ్రు సమస్య ఉన్నట్లయితే షాంపూల వాడకం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఆర్గానిక్ వైతే బెటర్.

కలబందతో..

శీతాకాలంలో కుదుళ్లు పొడిబారడం వల్ల చుండ్రుతో పాటు కొంతమందికి తలలో దురద ఎక్కువగా వస్తుంటుంది. దీనికి కలబంద మంచి పరిష్కారం. దీనికోసం కలబంద గుజ్జులో వేపాకుల పొడిని కలపాలి. దీనికి కొన్ని చుక్కల ఉసిరి నూనెను కూడా జతచేసి మిశ్రమంగా చేసుకోండి..ఇలా తయారైన మిశ్రమాన్ని మాడుకు అప్త్లెచేసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో గాఢత తక్కువగా ఉండే షాంపూ ఉపయోగించి తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ప్రాబ్లమ్ పోతుంది.

యాపిల్ సిడర్ వెనిగర్‌తో..

యాపిల్ సిడర్ వెనిగర్‌లో చుండ్రు సమస్యను తగ్గించే గుణాలున్నాయి. ఇది కుదుళ్ల పీహెచ్ స్థాయులను అదుపులో ఉంచి తలలో ఫంగస్ పెరగనివ్వకుండా చేస్తుంది. అరకప్పు నీటిలో పావు కప్పు యాపిల్ సిడర్ వెనిగర్‌ను కలపాలి. దీన్ని స్ప్రేబాటిల్లో వేసి మాడుపై స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత తలకు టవల్ చుట్టి.. పావుగంట నుంచి అరగంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

దాల్చిన చెక్కతో..

టేబుల్‌స్పూన్ దాల్చినచెక్క పొడికి రెండు టీస్పూన్ల చొప్పున తేనె, ఆలివ్ నూనెను కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ పదార్థాలన్నీ పూర్తిగా కలిసేంతవరకు బాగా కలపండి. ఆ తర్వాత దీన్ని కుదుళ్లకు అప్త్లె చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికోసారి చేయడం ద్వారా చుండ్రు రాకుండా జాగ్రత్తపడచ్చు.

నిమ్మతో..

నిమ్మలోని సుగుణాలు తలలోని పీహెచ్‌ను సాధారణ స్థాయిలో ఉండేలా చేసి శీతాకాలంలో వచ్చే చుండ్రును తగ్గిస్తాయి. దీనికోసం రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని కుదుళ్లకు పట్టించి కాసేపు సున్నితంగా మర్దన చేసుకొని నీటితో కడిగేయాలి. లేదంటే తలస్నానం చేసిన తర్వాత ఒక కప్పు నీటిలో టీస్పూను నిమ్మరసాన్ని కలిపి దాంతో తలను కడిగినా ఇదే ఫలితం కనిపిస్తుంది. అయితే ఇది ఎక్కువసార్లు పాటించకపోవడం బెటర్..నిమ్మకాయను డైరెక్టుగా తలకు రాస్తే జుట్టు రాలే ప్రమాదం ఉంది. సమస్య తీవ్రతను బట్టి ఇది చేయండి..లేదా నిమ్మతోపాటు పెరుగు, మెంతులును కలిపి రాస్తే అసలు ఎలాంటి సమస్యా ఉండదు.

ఈ జాగ్రత్తలు పాటిస్తే..అసలు సమస్యనుంచి దూరంగా ఉండొచ్చు

శీతాకాలంలో రోజూ తలస్నానం చేయడం మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల కుదుళ్ల నుంచి ఉత్పత్తయ్యే నూనెలు మొత్తం తొలగిపోయి చుండ్రు సమస్య తలెత్తుతుంది.

వీలైనంత వరకు హెయిర్ స్త్టెలింగ్ ఉత్పత్తులను చలికాలంలో ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా కుదుళ్లు సులభంగా పొడిబారిపోతాయి. కాబట్టి ఈ సీజన్లో ఇలాంటి వాటిని ఉపయోగిస్తే.. వాటిలోని రసాయనాల ప్రభావం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

విటమిన్ ‘బి’, జింక్.. వంటివి అధికంగా లభించే పదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే..ఇవి కుదుళ్లు పొడిబారకుండా చేసి చుండ్రు రాకుండా అడ్డుకుంటాయి. దీనికోసం వాల్‌నట్స్, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు.. వంటివి తీసుకోవచ్చు.

చుండ్రు రావడానికి ఉన్న ప్రధానమైన కారణాల్లో ఒత్తిడి కూడా ఒకటి. కాబట్టి.. వీలైనంత వరకు మైండ్ ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. సరైన సమయానికి ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత విశ్రాంతి ఉండేలా జాగ్రత్తపడితే ఈ సమస్య నుంచి మరింత సులభంగా బయటపడచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version