మీ పిల్లలకి ఆన్‌లైన్ క్లాసులు అవుతున్నాయా..? అయితే ఈ జాగ్రత్తలు ముఖ్యం..!

-

కరోనా మహమ్మారి కారణంగా పిల్లలకి ఆన్‌లైన్ క్లాసులు ( Online classes for Childrens ) జరుగుతూనే ఉన్నాయి. అయితే పిల్లలకి ఆన్లైన్ క్లాసులు అవుతున్నప్పుడు తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కరోనా కారణంగా ఇంకా పాఠశాలలో తెరుచుకోకపోవడంతో ఆన్లైన్ క్లాసులు జరుగుతూనే వున్నాయి. అందుకని ఆన్లైన్ లో పాఠాలు నేర్చుకునే పిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకని తల్లిదండ్రులు మంచిచెడుల గురించి పిల్లలకు చెప్పాలి.

పిల్లలకి ఆన్‌లైన్ క్లాసులు | Online classes for Childrens

 

పిల్లల భద్రత పట్ల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లల సైబర్ సేఫ్టీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని యునిసెఫ్ కూడా అంటోంది.

అయితే ఎంతో సేఫ్టీ గా ఉండే వెబ్సైట్ల వలన కూడా గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి సైబర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే పాఠశాల ఆన్లైన్ తరగతులు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా కోరుతున్నారు.

అలానే విద్యార్థులకు తల్లిదండ్రులు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్పాలి. అదే విధంగా మంచి డిజిటల్ అలవాట్లను కూడా నేర్పించాలి.

అలానే ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్ళకి తెలియాలి. ఆన్లైన్ కి సంబందించినవి మాత్రమే కాకుండా ప్రతి విషయంలోనూ కూడా మంచి చెడులను వాళ్ళు గుర్తించేలా చేయాలి.

ఇలా చేయడం వల్ల తోటి విద్యార్థులతో కానీ అధ్యాపకులతో కానీ హద్దు దాటలేరు. అలాగే విద్యార్థులకు ఇంటర్నెట్ సేఫ్టీ గురించి ట్రైనింగ్ ఇవ్వాలి. డిజిటల్ లైఫ్ లో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి అనేది పిల్లలకు అర్ధమయ్యేలా వివరించడం కూడా చాలా అవసరం. ఇలా పిల్లలకి తల్లిదండ్రులు ఈ విషయాలన్నీ కనుక నేర్పిస్తే తప్పకుండా పిల్లలు జాగ్రత్తగా ఉంటారు.

 

పాలిచ్చే తల్లులు డైట్ లో వీటిని తీసుకోండి..!

ఈ తప్పులు చేస్తే అనారోగ్య సమస్యలు తప్పవు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version