సాధారణంగా మనకి డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే అధిక నీరు అవసరం అవుతుంది. ఇక మనం బయటికి వెళ్లి పనులు చేస్తున్నప్పుడు మన శరీరంలోని నీటి శాతం చెమట రూపంలో బయటకు వెళుతుంది. అందుకోసం మనం ప్రతిరోజు ఐదు నుంచి ఆరు గ్లాసుల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. మరి గర్భవతులు రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తీసుకోవాలి? తక్కువ నీటిని తీసుకోవడం వల్ల వారిలో వచ్చే సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాలి అనేది మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం గర్భిణీ స్త్రీలు రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. అదే బిడ్డకు పాలు ఇస్తే ఆ సమయంలో రోజుకు 13 గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఎందుకంటే? గర్భవతులుగా ఉన్నప్పుడు శరీరానికి అధిక రక్తం, ఉత్పత్తి చేయడానికి అధిక ద్రవాలు అవసరమవుతాయి.
గర్భిణీ స్త్రీలు ఎక్కువగా నీటిని తీసుకోవడం వల్ల అంతర్గత వ్యవస్థలన్నీ బాగా పనిచేస్తాయి, ఇంకా శరీర వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా మూత్రపిండాల ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. నీటిని మాత్రమే కాకుండా అధిక మోతాదులో పండ్ల రసాలను కూడా తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలు డీహైడ్రేట్ కాకుండా ఉంటారు.
అధిక మొత్తంలో నీటిని ఒకేసారి తీసుకోవడం వల్ల కూడా సమస్యలు తలెత్తుతాయి. అలా కాకుండా కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు నీటిని తీసుకునేలా చూసుకోవాలి. ఇలా నీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల శిశువు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. వీలైనంతవరకు గర్భిణీ స్త్రీలు ఎండలో తిరగకపోవడం మంచిది. అలా వెళ్ళినప్పుడు తొందరగా డీహైడ్రేట్ అవుతారు. అంతేకాదు డీహైడ్రేట్ అయిన గర్భిణీ స్త్రీలు ఓఆర్ఎస్ ద్రావణంని తాగడం ద్వారా తొందరగా రీహైడ్రాట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చిట్కాలు పాటించి మీ బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి.