వాట్సాప్‌కు దీటుగా ఇండియ‌న్ ఆర్మీ కొత్త యాప్.. ఆర్మీకి ప్ర‌త్యేకం..

-

వాట్సాప్‌కు దీటుగా ఇండియ‌న్ ఆర్మీ ఓ స‌రికొత్త యాప్‌ను డెవ‌ల‌ప్ చేసింది. ఆత్మ‌నిర్భ‌ర భార‌త్‌లో భాగంగా ఈ యాప్‌ను ఇండియ‌న్ ఆర్మీ తీర్చిదిద్దింది. సెక్యూర్ అప్లికేష‌న్ ఫ‌ర్ ది ఇంట‌ర్నెట్ (ఎస్ఏఐ) పేరిట యాప్‌ను భార‌త ఆర్మీ లాంచ్ చేసింది. అయితే ఇది కేవ‌లం ఆర్మీలో ఉన్న‌వారికే అందుబాటులో ఉండ‌నుంది. దీంట్లో వాయిస్, టెక్ట్స్ మెసేజ్ లు పంపుకోవ‌చ్చు. వీడియో కాలింగ్ స‌దుపాయం కూడా ఉంది. పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ను ఈ యాప్ క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల ఆయా మెసేజ్ ల‌ను యాక్సెస్ చేయ‌డం ఇత‌రుల‌కు సాధ్యం కాదు.

ఇక ఆర్మీ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎస్ఏఐ యాప్‌ను ఉప‌యోగించుకోనున్నారు. ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై ఈ యాప్‌ను విడుద‌ల చేయ‌గా, త్వ‌ర‌లోనే ఐఓఎస్ ప్లాట్ ఫాంపై ఈ యాప్ ల‌భ్యం కానుంది. అందుకు సంబంధించిన డెవ‌ల‌ప్‌మెంట్ ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. ఈ మేర‌కు భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ తాజాగా ఈ యాప్‌కు చెందిన వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

వాట్సాప్‌కు బ‌దులుగా ఎస్ఏఐ యాప్‌ను భార‌త ఆర్మీ ఉప‌యోగించుకునేందుకు వీలుగా ఈ యాప్‌ను డెవ‌ల‌ప్ చేశారు. దీంట్లో పూర్తిగా సుర‌క్షితంగా మెసేజ్‌ల‌ను ఆర్మీ వారు పంపుకోవ‌చ్చు. ఈ యాప్ వాట్సాప్‌, టెలిగ్రాం త‌దిత‌ర ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల మాదిరిగా ప‌నిచేస్తుంద‌ని ఆర్మీలోని ఒక అధికారి వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version