26న తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాక.. పర్యటన వివరాలు ఇవే..

-

దక్షిణ అయోధ్యగా విరజిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రానికి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం విచ్చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా 28న ఉదయం 10:40 కి భద్రాచలానికి రానున్న ఆమె భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకోనున్నారు.

అలాగే పర్యాటక శాఖ ప్రసాద్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు సంబంధించి వర్చువల్ ఇనాగ్రేషన్ ను చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారిక సమాచారం వచ్చింది. ఇది ఇలా ఉండగా భద్రాద్రి రామయ్యను 1965 జూలై 13న అప్పటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణ దర్శించారు. ఈ సమయంలో ఆయన గోదావరిపై భద్రాచలం వద్ద నిర్మించిన వారధిని ప్రారంభించారు. మళ్ళీ 57 ఏళ్ల అనంతరం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం వస్తుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version