కేరళలో కలకలం… మళ్లీ మొదలైన బర్డ్ ఫ్లూ పంజా

-

కేరళలోని కొట్టాయం, అర్పూకర, తలయజమ్ పంజాయతీల్లో మళ్లీ బర్డ్ ఫ్లూ పంజా కలకలం రేపుతోంది. ఇతర ప్రాంతాలకు కూడా ఇది వ్యాపించి పంజా విసిరింది. దీంతో వేరే ప్రాంతాలకు కూడా పంజా విసిరే అవకాశాలు ఉండటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రభావిత ప్రాంతాల నుంచి కిలోమీటర్ దూరం వరకు పరిధిలో ఉన్న కోళ్లు, బాతులు, ఇతర పెంపుడు పక్షులు చంపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో, దాదాపు 8 వేల వరకు పక్షులకు అధికారులు చంపేయనున్నారు.

ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని, క్రిమిసంహారక మందులను చల్లాలని స్థానిక సంస్థలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పోలీసులు, రెవెన్యూ, జంతు సంరక్షణ శాఖ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో రక్షణ చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్లు, బాతులు, మాంసం అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను తినడం వల్ల జబ్బు మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వలస పక్షులు, సముద్ర పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది. చనిపోయిన పక్షుల నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version