పాత కక్షలతో రాహుల్ పై దాడి…?

-

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై దాడి పాత కక్షలతోనే జరిగిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాహుల్ పై దాడి చేసిన వాళ్ళు అతనిపై కక్ష తోనే దాడి చేసారని పలువురు కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. నిన్న రాత్రి ఆయన గచ్చిబౌలి లోని, పబ్ కి తన స్నేహితులతో కలిసి వెళ్ళాడు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కొందరు యువకులు ఆయనతో వచ్చిన యువతిని అసభ్యంగా కామెంట్ చేసారు.

దీనిపై మండిపడిన రాహుల్ వారితో గొడవకు దిగాడు. క్రమంగా గొడవ పెద్దది కావడంతో వాళ్ళు రాహుల్ తలపై బీర్ బాటిల్ తో దాడి చేసారు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో రాహుల్ ని అక్కడ ఉన్న కొందరు ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేసారు. మీడియాలో అతని ఆరోగ్యంపై ఆందోళన మొదలయింది. అతను చావు అంచుల వరకు వెళ్ళాడు అంటూ పలువురు కామెంట్ చేసారు. కాని అతను కేసు మాత్రం పెట్టలేదు.

పోలీసులు మాత్రం సుమోటో గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ ఫిర్యాదు చేయకపోవడం తో దీని వెనుక పాత కక్షలు ఉండే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.గతంలో రాహుల్ కి వారికి మధ్య గొడవలు ఉన్నాయని, బిగ్ బాస్ విషయంలో దాడి చేసిన సన్నిహితులకు అతనికి మధ్య వివాదం ఉందని అందుకే ఇప్పుడు దాడి చేసి ఉండవచ్చు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version