గత ప్రభుత్వం ఉద్యోగులను అణిచి వేయాలని చూసింది: కె.ఆర్. సూర్య నారాయణ

-

2019 ఎన్నికలకు ముందు మాజీ సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులకు కీలక హామీలు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగుల పీఆర్సీతో పాటు పలు హామీలను నెరవేర్చాతానని జగన్ మాట ఇచ్చారు.అయితే ఎన్నికల్లో మెజార్టీతో గెలిచిన తర్వాత ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేశారు. దీంతో ఉద్యోగులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసింది.ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య వేదక చైర్మన్ కె.ఆర్. సూర్య నారాయణ సమస్యలపై పోరాటం చేయాగా ఆయనను ప్రభుత్వం వేధించింది. సూర్య నారాయణపై కేసులు పెట్టడంతో ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించింది.

ఆదివారం మీడియాతో మాట్లాడుతూ…గత ప్రభుత్వంలో జరిగిన వేధింపులపై కీలక విషయాలు వివరించారు. గత ప్రభుత్వం ఉద్యోగులను అణిచి వేయాలని చూసిందని, ఏ కేసు అనే విసయాన్ని చెప్పకుండా తనను విచారణకు పిలిచేవారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఐఏఎస్‌లు దిగజారిపోయి ప్రవర్తించారని మండిపడ్డారు. విచారణ పేరుతో తన ఫ్యామిలీని వేధింపులకు గురి చేశారని ,విచారణ సమయంలో తన భార్య మెడలో ఉన్న నల్లపూసల గొలుసును కూడా తీయించారని పోలీసులపై ఆయన మండిపడ్డారు. తన ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులను కాపాలాపెట్టారని పేర్కొన్నారు. తన కుటుంబాన్ని వేధించిన అధికారులు రావి సురేశ్ రెడ్డి, భాస్కరరావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version