సంక్రాంతి పండుగ సమయంలో పిల్లలు, యువత గాలిపటాలను ఎగురవేస్తుంటారు. చైనా మాంజా వాడకం వలన గాలిపటం తెగిపోయిన సమయంలో అవి గాల్లో వేలాడుతుంటాయి. దీంతో గాల్లో విహరిస్తున్న పక్షులు చైనా మాంజాకు చిక్కుకుని వేలాడుతున్నాయి. మాంజా వాటి రెక్కులకు, కాళ్లకు తగలడం వలన అవి నేలరాలి ప్రాణాలు విడుస్తున్నాయి.
ఈ క్రమంలోనే కరీంనగర్ బస్టాండ్ వద్ద కరెంటు తీగలకు తట్టుకున్న మాంజా దారానికి ఓ కాకి చిక్కుకుని వేలాడుతోంది. కాకిని చూసి స్పందించిన బ్లూ క్రాస్ కరీంనగర్ ఇంచార్జ్ సోషల్ వర్కర్ నారాయణ.. ఆర్టీసీ బస్సును ఆపి పైకెక్కి కాకిని క్షేమంగా దారం నుంచి విడిపించారు. అందుకు ట్రాఫిక్ పోలీసులు సైతం సహకరించారు.చైనా మాంజా వినియోగం మానుకోవాలని ప్రభుత్వం, సామాజిక ఉద్యమకారులు ఎంత అవగాహన కల్పించినా కొందరు వినిపించుకోవడం లేదు.