అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెల ధరలు కొద్ది నెలల్లో మరింత తగ్గనున్నాయని జెమినీ ఎడిబల్స్ అండ్ ఫాట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి తెలిపారు. ఫ్రీడమ్ బ్రాండ్ తో పాటు జెమిని ఏడిబల్స్.. సీన్ ఫ్లవర్ ఇతర వంటనూనెలను విక్రయిస్తుంది. స్వల్పకాలంలో నిత్యవసర వస్తువులు గిరాకీ లో మార్పు ఉండదు. సరఫరాలో తేడాల వల్లే ధరల్లో మార్పులు వస్తాయి.
ప్రస్తుతం సరఫరా మెరుగుపడుతుంది అందులో వంటనూనెల ధరలు మరింతగా తగ్గగలవని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి సన్ ఫ్లవర్ నూనె టన్ను ధర 18 వందల డాలర్లు ఉందని.. ఇది 12 వందల డాలర్లకు చేరవచ్చని అంచనా వేశారు. అలానే సోయా నూనె 15 వందల డాలర్ల నుంచి.. 12 వందల డాలర్లకు, పామాయిల్ 13 వందల డాలర్ల నుంచి 1,000 డాలర్లకు కొద్ది నెలల్లో చేరే వీలుందని చెప్పారు. కంపెనీ 80% సన్ ఫ్లవర్ నూనెను ఉక్రెయిన్ నుంచి కొనుగోలు చేస్తోందన్నారు.