తలకొన టెంపుల్లో అర్చకులు ఒకరిపై ఒకరు దాడి..

-

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తలకొనలో గల శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం ఆలయ అర్చకులు ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు దిగారు. ప్రధాన అర్చకుడి కుమారుడిని మనోజ్ శర్మ ప్రచారకుడిగా నియమించారు. దీంతో మరో అర్చకుడు ఆలయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ప్రధాన అర్చకుడు వచ్చి ఫిర్యాదు చేసిన మరో అర్చకుడిపై దాడి చేశాడు.

ఆ తర్వాత ఇద్దరు అర్చకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఘటన జరిగిన టైంలో ఇద్దరు అర్చకులు దాడి చేసుకుంటుండగా తోటి అర్చకులు ఆపేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో భక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆలయంలో ఇలాంటి గొడవలు సరికాదని భక్తులు చెబుతున్నారు. ఆలయ పవిత్రత దెబ్బతినేలా అర్చకులు ప్రవర్తించడం సరికాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news