ప్రధాని మోడీ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ తనకు మంచి స్నేహితుడు అని, నైస్ పర్సన్ అని పేర్కొన్నారు.మోడీ ఒక టోటల్ కిల్లర్ అని అభివర్ణించారు.భారతదేశం మీద ఎవరైనా బెదిరింపులకు పాల్పడినప్పుడు తాను సహాయం చేస్తానని అంటే.. తానే చూసుకుంటానని కొన్ని వందల సంవత్సరాల నుంచీ మేం వాళ్లను ఓడిస్తున్నామని మోడీ చెప్పారని ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లి ఆయన్ను కలిసి వచ్చిన విషయం తెలిసిందే.
https://twitter.com/Telugu_Galaxy/status/1895732100365692930