కేసీఆర్ విడుదల చేసిన వీడియోలపై ప్రధాని మోడీ సీరియస్..? రంగంలోకి ముగ్గురు అధికారులు

-

టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావులని బీజేపీలోకి తీసుకోచ్చేందుకు బేరసారాలు చేసిన ఆడియో, వీడియోలు బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరికి 100 కోట్ల ఆఫర్ చేశారని తెలిసింది. దీనిపై మొన్న సీఎం కేసీఆర్‌ స్వయంగా వీడియోలను రిలీజ్‌ చేశారు. దీంతో బీజేపీ పార్టీ డిఫెన్స్‌ లో పడింది.

అయితే.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలోనే ఇదంతా నడిచినట్లు ఈ కేసులోని నిందితులు చెప్పినట్టుగా ఆడియో, వీడియో రికార్డుల్లో బయటపడటంతో, పిఎంఓ కార్యాలయం ఆరా తీస్తోంది.

ఈ వ్యవహారంలోని నిజ నిజాలను నిగ్గు తేల్చాల్సిందిగా పిఎం లోని ముగ్గురు కీలక అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర పెద్దలతో ఉన్న సంబంధాలు, నకిలీ ఆధార్ కార్డులు, ఆడియో, వీడియో రికార్డులపై లోతుగా విశ్లేషణ చేపట్టనున్నారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version