తల్లి మరణించినా..అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ !

-

ప్రధాని నరేంద్రమోడీకి మాతృ వియోగం కలిగింది.ప్ర ధాని నరేంద్ర మోదీ తల్లి హిరాబెన్ ఇవాళ ఉదయం మరణించారు. వందేళ్ళ వయసు ఆమే అహ్మదాబాద్ నివాసంలో రెం డు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. యూ ఎన్ మెహతా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. కానీ ఆమె ఇవాళ చనిపోయారు.

అయితే, తల్లి మరణించినా..పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కార్యక్రమాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ప్రధాని మోడీ. హౌరా, కోల్‌కతాలో వందే భారత్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని మోడీ. అటు నమామి గంగే కింద జాతీయ గంగా కౌన్సిల్ సమావేశం, బెంగాల్‌లోని జోకా-తరటాలా మెట్రో లైన్, రైల్వే యొక్క ఇతర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version