బాలీవుడ్ బ్యూటీతో ప్రభాస్ లవ్..క్లారిటీ ఇదే !

-

బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 2 తాజా ఎపిసోడ్ 1 నెట్టింట టాప్ ట్రేడింగ్ లో నిలుస్తోంది. ఇంతకీ ఆ ఎపిసోడ్ ఏంటో ఊహించే ఉంటారు. దేశమంతా ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో బాలకృష్ణ సరదా చిట్ చాట్ ఎపిసోడ్ చర్చే నడుస్తోంది. కొన్ని గంటల క్రితమే విడుదలైన ఈ ఎపిసోడ్ రికార్డు స్థాయిలో స్పందనతో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ ఎపిసోడ్ లో ఆది పురుష్ కోస్టార్ కృతిసనన్ తో డేటింగ్ లైఫ్ గురించి అడిగాడు బాలయ్య ఈ పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని, మా మధ్య స్నేహం తప్ప అంతకుమించి రిలేషన్షిప్ ఏమీ లేదని కృతిసనన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని చెప్పాడు ప్రభాస్. దీంతో ప్రభాస్, కృతిసనన్ మధ్య ఉన్న అనుబంధం పై వస్తున్న వార్తలకు చెక్ పడ్డది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒకరోజు ముందే రిలీజ్ అయిన బాహుబలి పార్ట్ 1 ఎపిసోడ్ ఆహాలో సందడి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version