టీమిండియాతో ప్రధాని మోడీ ముచ్చట్లు..!

-

టీ-20 ప్రపంచ కప్ విషయానికొస్తే.. టీమిండియా 2007 ఫస్ట్, 2024 చివరిది టైటిల్ విజయం సాధించడం గమనార్హం. 2024 టీ20 వరల్డ్ కప్ విజయం సాధించడంతో టీమిండియా పట్ల ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు సంతోషం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్ క్రికెట్ టీం ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు. ఆయనతో కలసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. వెస్టిండీస్ లో టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న టీం ఇండియా ఈరోజు ఉదయం భారత్ కు చేరుకుంది. ప్రధాని నివాసానికి వెళ్లింది. తన నివాసానికి వచ్చిన టీం ఇండియా క్రికెటర్లను మోదీ అందరితో విడివిడిగా పలకరించారు. వారితో కాసేపు ముచ్చటించారు.

ఫైనల్స్ లో వారి మనసులో చెలరేగిన అభిప్రాయాలనుకూడా మోదీ ఇంట్రస్టింగ్ గా అడిగి తెలుసుకున్నారు.పదిహేడేళ్ల తర్వాత ఇండియాకు కప్ సాధించిన టీం ఇండియా సభ్యులను ప్రధాని ప్రశంసించారు. వారితో కలసి గ్రూపు ఫొటో దిగారు. అనంతరం ప్రధాని నివాసం నుంచి బయలుదేరి ముంబయికిచేరుకుంటారు. సాయంత్రం ముంబయిలో భారత్ జట్టు రోడ్ షో నిర్వహించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version