ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా విజయం తర్వాత, లెజెండరీ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పని చేయనున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ఇండస్ట్రీలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మహేష్ బాబు ప్రత్యేక శిక్షణ తీసుకుని తన బాడీ మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నాడు. ఈ ప్రాజెక్కి మూడేళ్ల వరకు డేట్స్ ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో ఈ సినిమా సెట్ వర్క్ ప్రారంభమైనట్లు తెలిసింది. ఒక్క సెట్ మాత్రమే కాకుండా.. అన్ని రకాల సెట్లను రాజమౌళి డిజైన్ చేయిస్తున్నాడని సమాచారం.