కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పేరు ఎత్తకుండానే.. ఆయన కుటుంబంపై ఫైర్ అయ్యారు ప్రధాని మోడీ. అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదు..కుటుంబ పాలన అన్ని వ్యవస్థలు తన కంట్రోల్ లో ఉండాలని అనుకుంటుందని వెల్లడించారు. అవినీతి లేకుండా డీబీటీ ద్వారా అన్ని వర్గాలకు సాయం అందిస్తున్నామని చెప్పారు.
డిజిటల్ పేమెంట్ వల్ల అవినీతి అక్రమాలకు తావుండదు.. అవినీతిని నేను ఒప్పుకోను.. అవినీతి పరుల పట్ల కఠినంగా వ్యవహరిద్దామా? వద్దా? అని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ‘సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలు ప్రారంభించాం. భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వరస్వామి నగరంతో కలిపాం. రాష్ట్రంలో రూ.11 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించాం. అని అన్నారు.
అంతకుముందు.. ప్రధాని మోదీ సభా వేదిక పైనుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు, జాతీయ రహదారుల నిర్మాణానికి, రూ.1366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ భవన నిర్మాణానికి, రాష్ట్రంలో రూ.7,864 కోట్లతో కొత్తగా 6 జాతీయ రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేశారు.