Prithviraj Sukumaran: మోహన్ లాల్‌తో పృథ్వీరాజ్ సుకుమారన్..ఆనందంగా ఉందని ట్వీట్

-

మాలీవుడ్ (మలయాళం) మల్టీ టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. మలయాళంతో పాటు ఇతర భాషల్లో సినిమాలు చేస్తు్న్న పృథ్వీరాజ్..ఇటీవల వరుస విజయాలు అందుకున్నారు. ‘బ్రో డ్యాడీ’,‘జన గణ మన’ చిత్రాలు ఘన విజయం సాధించాయి.

ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్..ఓ వైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరో వైపున దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఈయన నటించిన ‘కడువ’ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సంగతులు పక్కనబెడితే..తాజాగా తనకు ఆనందంగా ఉందని తెలుపుతూ..బ్యాక్ టు హోం అనే క్యాప్షన్ తో మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తో దిగిన ఫొటో షేర్ చేశాడు.

ఆ ఫొటో చూసి నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఫ్యాన్ బోయ్ మెట్ డైరెక్టర్ సర్, సూపర్ హిట్ కాంబో, వావ్, ఎవర్ గ్రీన్ కాంబో’ అని కామెంట్స్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ ఫిల్మ్ చేసిన మోహన్ లాల్..ప్రస్తుతం లూసిఫర్ కు సీక్వెల్ ‘ఎంపురన్’లో నటిస్తున్నాడు. మరో వైపున మోహన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘బరోజ్’లో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version