అద్దె బస్సులు, స్కూల్ బస్సులు నడుపుతాం: సోమేష్ కుమార్

-

ద‌స‌రా పండ‌గ స‌మ‌యంలో తెలంగాణలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం, కార్మికులు బెట్టు వీడడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు తేల్చిచెబుతున్నాయి. గత మూడు రోజులుగా ఆర్టీసీ జేఏసీతో చర్చించామని.. కొద్దిగా టైమ్ ఇవ్వండని అడిగినా కూడా వాళ్లనుంచి సరైన స్పందన రాలేదని ఐఏఎస్‌ అధికారుల కమిటీ చైర్మన్ సోమేశ్ కుమార్ చెప్పారు. సమ్మె నివారణకు జరపాల్సిన చర్చలన్నీ జరిపాం.

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే అద్దె బస్సులు, ప్రైవేటు బస్సులతో పాటు అవసరమైతే స్కూల్ బస్సులను కూడా నడుపుతామని చెప్పారు. అవసరమైన రక్షణ ఏర్పాటు చేసి ప్రయివేటు బస్సులు నడిపిస్తామన్నారు. ఈ క్ర‌మంలోనే 2100 అద్దె బస్సులను నడుపుతామని, 3 వేల మంది డ్రైవర్లను నియమిస్తామని వెల్లడించింది. తాత్కాలిక అనుమతులతో స్కూల్ బస్సులను రహదారురలపై తిప్పుతామని, పోలీసు రక్షణలో అద్దె బస్సులను నడుపుతామని వెల్లడించారు త్రిసభ్య కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్. ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె చట్టవిరుద్ధమని ప్రభుత్వం భావిస్తోంది. చట్ట విరుద్ధంగా సమ్మెకు దిగితే చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని హెచ్చ‌రించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version